IPL: CSKలోకి సంజూ శాంసన్?
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సంజూ శాంసన్ రావడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ట్రేడింగ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి సంజూ శాంసన్‌ను CSK దక్కించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, సంజూ శాంసన్ కోసం CSK తమ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను RRకు బదిలీ చేసినట్లు సమాచారం. ఈ ట్రేడ్ డీల్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.