వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..!
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్‌లో ఇవాళ సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 7,270 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 20,800 ధర పలకగా... వండర్ హాట్ (WH) మిర్చి రూ. 33,000పలికింది. తేజ మిర్చి ధర రూ. 19,600, ఎల్లో మిర్చిరూ.21వేలకి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.