VIDEO: కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన సీపీ

VIDEO: కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన సీపీ

KMM: కల్లూరు మండలంలోని ఎర్రబోయినపల్లిలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని సీపీ సునీల్ దత్ బుధవారం సందర్శించారు. పోలింగ్ సరళిని, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సీపీ వెంట ఎస్సై డి.హరిత ఉన్నారు.