VIDEO: తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ

WGL: పర్వతగిరి పట్టణ కేంద్రంలోని దుగ్యాల సురేందర్ రావు ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు పడ్డారు. ఇంటికి తాళం వేసి హైదరాబాదుకు వెళ్లడంతో పసిగట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాలో ఉన్న సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు తీసుకొని ఇంటి వెనకనుంచి జారుకున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టారు.