హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

MHBD: కేసముద్రంలో నాలుగేళ్ల క్రితం జరిగిన బిచ్చగాడు వెంకన్న హత్య కేసులో నిందితుడు హరీశ్‌కు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది. 2020లో రౌడీగా ఎదగాలనే ఉద్దేశంతో, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. రైల్వే స్టేషన్ సమీపంలో నిద్రిస్తున్న వెంకన్నపై పారతో దాడి చేసి, కత్తితో తలను మొండెం నుంచి వేరు చేశాడు.