జిల్లాకు బడ్జెట్లో అన్యాయం: సీపీఎం
రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించలేదని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సోమవారం పెద్దకడబూరు మండల కార్యదర్శి ఈ.తిక్కన్న మాట్లాడుతూ.. జిల్లాకు రూ.10,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పులికనుమ, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులకు నిధులు, సాగు–తాగునీరు కల్పించి వలసలు నివారించాలని కోరారు.