యూరియా కోసం చెప్పులతో క్యూ

యూరియా కోసం చెప్పులతో క్యూ

SRCL: గంభీరావుపేట మండలం కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘం గోదాం ఎదుట యూరియా కోసం శుక్రవారం రైతన్నలు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. రైతులు గోదాం తెరవకముందే చెప్పులను, బండరాళ్లను క్యూ పెట్టారు. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు తెలిపారు. అధికారులు స్పందించి యూరియ కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.