అంబులెన్స్‌లోనే ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

అంబులెన్స్‌లోనే ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

SRPT: చివ్వెంల మండలం కోమటికుంటకు చెందిన పీ. సమ్మక్కకు ఈరోజు పురిటినొప్పులు రాగా, 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈఎంటీ ప్రవాళిక, పైలట్ శంకర్ సమయస్ఫూర్తితో ప్రసవం చేసి ప్రాథమిక చికిత్స అందించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.