బొంరాస్‌పేటలో ఏకగ్రీవంగా రుక్కిబాయి
VKB: బొంరాస్‌పేట మండలం సాలిండాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎస్టీ మహిళలకు కేటాయించడంతో మొదట రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. అనంతరం బుధవారం ఒక నామినేషన్ ఉపసంహరించడంతో రుక్కి బాయి ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సర్పంచ్ తో పాటు ఎనిమిది వార్డులు ఏకగ్రీవం కావడంతో గ్రామస్థులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.