ఆ ప్లేయరే CSKకు అసలు సమస్య: ఇర్ఫాన్
IPL 2026: ధోనీ గాయం, జట్టులో సీనియర్లు లేకపోవడంతో.. CSK ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడింది. రుతురాజ్, సంజూ ఏ మాత్రం రాణించట్లేదు. అయితే వీటి కంటే CSKకు నూర్ అహ్మద్ అసలు సమస్య అని మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటివరకు 10 ఓవర్లు వేసిన అతను ఒక్క వికెట్ తీయకపోగా 111 రన్స్ ఇచ్చుకోవడమే ఇందుకు కారణం. కాగా గతేడాది నూర్ 11 మ్యాచుల్లో 24 వికెట్లు తీశాడు.