ఇళ్ల నిర్మాణం కోసం మహిళల ఆందోళన

KKD: సామర్లకోట మండలం ఉందురు బ్రహ్మానందపురంలో ఇళ్ల నిర్మాణం కోసం శుక్రవారం మహిళలు ఆందోళన నిర్వహించారు. ఇళ్ల స్థలాలు ఇచ్చి ఏళ్లు గడిచినా, నిర్మాణం చేపట్టే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి, ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని డిమాండ్ చేశారు.