అంధకారంలో చంద్రశేఖరపురం మండలం

అంధకారంలో చంద్రశేఖరపురం మండలం

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంట నుండి కురుస్తున్న భారీ వర్షానికి మండలంలోని మైలు చర్ల, తుంగోడు, అంబవరం కొత్తపల్లి గ్రామాలలో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమేమయ్యాయి. వర్షానికి మండలంలో విద్యుత్ అంతరాయం కలిగింది. అంధకారంలో గ్రామాలు ఉన్నాయి.