సీతారాంపురం కాలనీలో నీటి సమస్య

సీతారాంపురం కాలనీలో నీటి సమస్య

SRPT: చిలుకూరు మండలంలోని సీతారాంపురం కాలనీ వాసులు కొన్ని రోజులుగా నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదని బుధవారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మోటర్ చెడిపోయి 20 రోజులు అవుతున్న నేటికీ సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టలేదని వాపోయారు.