DRDO అపోలో ఎదుట కవిత నిరసన

DRDO అపోలో ఎదుట కవిత నిరసన

TG: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కంచన్‌బాగ్ DRDO అపోలో ఆస్పత్రి ముందు నిరసనకు దిగారు. RTC సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న శంకర్ గౌడ్‌ను పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. శంకర్‌ను చూసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసుల తీరును తప్పుబట్టారు.