టీడీపీ నాయకులతో సమావేశం

W.G: రైతు సంబరాలలో భాగంగా భీమవరం పట్టణములో 13వ తేదీన లూధరన్ హై స్కూల్ గ్రౌండ్స్ వద్ద నుండి ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు బయలుదేరి భీమవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఆవరణలో రైతు సంబరాల సభను నిర్వహించనున్నామని సోమవారం తోట సీతారామలక్ష్మి అన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ యంపి పాకా వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొంటారన్నారు.