గంగమ్మ సేవలో కలెక్టర్ సుమిత్ కుమార్

CTR: కుప్పంలో వెలసిన తిరుపతి గంగమ్మను శుక్రవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్ కుమార్ దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ ఛైర్మన్ రవిచంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.