ఆశ్రమ పాఠశాల తనిఖీ చేసిన ఐటీడీఏ అధికారి

MNCL: జన్నారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా తనిఖీ చేశారు. గురువారం మధ్యాహ్నం ఆమె ఆశ్రమ పాఠశాల, హాస్టల్‌ను తనిఖీ చేసి ఉపాధ్యాయుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.