జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఉపాధ్యాయురాలిపై విద్యార్థి దాడి

చల్లపల్లి: పురిటిగడ్డ జిల్లా పరిషత్ హై స్కూల్లో మహిళా ఉపాధ్యాయినిపై పదవ తరగతి విద్యార్థి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి జరిగి నాలుగు రోజులు అయినా ప్రధానోపాధ్యాయుడు కానీ, టీచర్లు కానీ స్పందించలేదు. తరగతి గదులలో గతంలో కూడా టీచర్లను ఎదిరించిన సందర్భాలు ఉన్నాయి. పోలీస్ శాఖ, విద్యాశాఖ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, విద్యార్థులు విన్నవించుకుంటున్నారు.