'తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి'

E.G: కడియం మండలంలోని వివిధ గ్రామాల్లో కురిసిన భారీ వర్షం వల్ల తాము నిండా మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేసి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు.