ఆడి కార్ల ధరలు పెంపు

విలాస కార్ల సంస్థ ఆడి ఇండియా తమ వాహన ధరలను ఈ నెల 15 నుంచి 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడివస్తువుల ధరలు, విదేశీ మారకపు ద్రవ్య ప్రభావంతోనే వాహన ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. మొత్తం వాహన శ్రేణికి ధరల పెంపు ఉంటుందని సంస్థ వెల్లడించింది. దేశంలో ఏ4, క్యూ5, క్యూ7, ఆర్ఎస్ ఇ-ట్రాన్ జీటీ సహా పలు మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది.