VIDEO: జూలకల్లు వద్ద తెగిన రహదారి

PLD: భారీ వర్షాల కారణంగ పిడుగురాళ్ల మండలం జూలకల్లు సమీపంలో బుధవారం రహదారి తెగిపోయింది. రోడ్డుపై నుంచి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కార్లు, బస్సులు వెళ్లడానికి వీలు లేకుండా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.