భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం

MBNR: అడ్దాకుల మండలం రాచాల గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా స్వామివారి కటాక్షంతోపాటు సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమంలో గ్రామస్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.