బాలికతో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు
NLG: మిర్యాలగూడలోని శాంతినగర్‌కు చెందిన నవీన్ అనే యువకుడు తొమ్మిదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న మహిళ కుమార్తెపై నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో నిందితుడిని గురువారం కోర్టుకు రిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.