'చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'
GNTR: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పొన్నూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాజీ సాహెబ్ అన్నారు. ఈ నేపథ్యంలో 17వ వార్డులో సోమవారం రాత్రి నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మెయింటెనెన్స్ అండ్ వెల్పేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు మగ్బుల్ బేగ్, న్యాయవాది సతీష్ కుమార్ పాల్గొన్నారు.