'హుస్నాబాద్ బస్ స్టాండ్‌ను పరిశుభ్రంగా ఉంచుదాం'

'హుస్నాబాద్ బస్ స్టాండ్‌ను పరిశుభ్రంగా ఉంచుదాం'

SDPT: ప్రజా పాలన - పట్టణ ప్రణాళిక'లో భాగంగా డీఎం వెంకన్న నాయక్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ బస్‌స్టాండ్‌లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. బస్ స్టేషన్ మేనేజర్ హరి నాయక్ ఆధ్వర్యంలో చెత్తను తొలగించి, మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. ప్రయాణికులు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, బస్ స్టాండ్ ఆవరణలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.