యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

PDPL: కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే యువ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం తరఫున అన్నిరకాలుగా ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రామ్ ఇన్ఫో లిమిటెడ్ ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఏర్పాటుచేసిన ఐ కొలాబ్ హబ్ ఫౌండేషన్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రోజురోజుకీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆలోచించాలన్నారు.