బాలికపై పాస్టర్ అత్యాచారం..!
ఏలూరు జిల్లాలోని కామవరపుకోట మండలంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై చర్చి పాస్టర్ రాంబాబు అత్యాచారానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. బాలిక గర్భం దాల్చడంతో గర్భనిరోధక మాత్రలు మోతాదుకు మించి ఇవ్వగా, తీవ్ర రక్తస్రావంతో ఆమె అస్వస్థతకు గురైందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు బాలికను చికిత్స కోసం ఏలూరు తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.