బీటి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
PDPL: రామగుండం నియోజకవర్గం గోదావరిఖనిలోని జనగామ ప్రాంతంలో గురువారం రూ. 45 లక్షల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగామ ప్రాంత అభివృద్ధికి రూ.3 కోట్లతో రోడ్ వెడల్పు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.