సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
JGL: బుగ్గారం మండలంలోని వెల్గొండ గ్రామంలో ముగ్గురు లబ్ధిదారులకు రూ.1.32 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వేముల సుభాష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు మల్లేశ్, వార్డు సభ్యులు శ్రీకాంత్ ఉన్నారు.