ధర్మవరం చేనేతల స్టడీ టూర్

ధర్మవరం చేనేతల స్టడీ టూర్

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ధర్మవరం నుంచి 45 మంది చేనేత కార్మికులు కాంచీపురం హ్యాండ్‌లూమ్ క్లస్టర్ స్టడీ టూర్‌కి బయలుదేరారు. బీజేపీ నేత హరీశ్ బాబు బస్సును ప్రారంభించారు. ఈ టూర్ చేనేతల అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. వారు తిరిగొచ్చాక మంత్రి చేనేతలతో సమావేశమై అక్కడి విశేషాలు తెలుసుకుంటారని తెలిపారు.