VIDEO: పొదల్లో దూసుకు వెళ్లిన కారు.. అతివేగం కారణం
KMM: ఎర్రుపాలెం మండలంలో ఇవాళ రోడ్డు ప్రమాద ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు చొప్పకట్లపాలెం గ్రామాల సమీపంలో అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లో దూసుకు వెళ్లినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి గాయాలు అయినట్లు వెల్లడించారు.