హుజురాబాద్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి చౌరస్తా వద్ద ఇవాళ మహాత్మా జ్యోతి రావు పూలే వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం నాయకులు మాట్లాడుతూ.. జ్యోతిరావు ఫూలే హక్కుల కోసం పోరాడిన మహానీయుడని ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.