రైతులను పరామర్శించాలి: జగన్

రైతులను పరామర్శించాలి: జగన్

GNTR: అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించాలని, వారికి ధైర్యం చెప్పాలని సోమవారం జిల్లా వైసీపీ నేతలకు పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశించారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ధాన్య సేకరణలో యంత్రాంగం విఫలమైందని, పంటలు నష్టపోయాయని అన్నారు. నాయకులు గ్రామాల స్థాయిలో రైతులకు అండగా ఉండాలని సూచించారు.