ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
ఢిల్లీ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద రూ.12 కోట్ల విలువైన 12 కిలోల విదేశీ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లగేజీ తనిఖీ చేస్తుండగా, ఆమె నకిలీ NIA అధికారి ఐడీ చూపించి బెదిరించడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత వాష్‌రూమ్‌కు వెళ్లి అక్కడి నుంచి NIA జాకెట్ వేసుకుని పారిపోవాలని చూసింది. దీంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.