'రైతులు ఈ-క్రాప్ చేసుకోవాలి'

'రైతులు ఈ-క్రాప్ చేసుకోవాలి'

VZM: నెల్లిమర్ల మండలానికి చెందిన రైతులు తమ పంటలకు తప్పనిసరిగా ఈ-క్రాప్ చేయించుకోవాలని ఏడీఏ కోటేశ్వరరావు సూచించారు. ఈమేరకు సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్థానిక వ్యవసాయ కార్యాలయంలో ఏవో శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఏఈవోలు, వీఏఏలతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. అన్ని రకాల పంటలకు ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి అన్నారు.