రాజవొమ్మంగిలో ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం
ASR: ఈ నెల 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసి, రాజవొమ్మంగి మండలాన్ని జిల్లాలోనే ముందుంచాలని ఎంపీపీ గోము వెంకటలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓ యాదగిరియేశ్వరావు అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డా. సుష్మ, డా. పావని, డా. శరత్ చంద్ర పాల్గొన్నారు.