ఉపాధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్
SRPT: ఉపాధి హామీ పథకం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. 'జల్ శక్తి' కింద ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి 20 రకాల నీటి సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. నర్సరీలు, వర్షపు నీటి నిల్వ పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు.