VIDEO: అర్ధాకలితో అలమటిస్తున్న హాస్టల్ విద్యార్థులు
KDP: ఖాజీపేట మండలంలోని సమీకృత వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 60 మంది విద్యార్థులకు తగిన ఆహారం అందించడం లేదని, పరిశుభ్రత లేక బాత్‌రూములు దుర్వాసనతో ఉన్నాయని విద్యార్థులు వాపోతున్నారు. వార్డెన్ విద్యార్థుల చేత మందు తెప్పించుకోవడం, అవమానకరంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.