'బస్సుల్లో మహిళలకు సహకరించాలి'

అన్నమయ్య: స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి డ్రైవర్, కండక్టర్లు సహకరించాలని DM వెంకట రమణారెడ్డి కోరారు. ఈ మేరకు మదనపల్లె ఆర్టీసీ 2వ డిపోలో గేట్ మీటింగ్ మంగళవారం జరిగింది. 2 - డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవలన్నారు.