రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
VZM: ఎల్‌కోట మండలం చందలూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి అండర్-14 బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పీడీ శ్రీరాములు ఇవాళ తెలిపారు. అక్టోబర్ 31న కొత్తవలస మండలం జిందాల్ పాఠశాలలో జరిగిన ఎంపికల్లో దుర్గ భవాని, లోహిత్ ఎంపికయ్యారన్నారు. ఈనెల 24 నుండి 26 వరకు మదనపల్లిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.