ఓక్ ల్యాండ్ స్కూల్లో వైద్య శిబిరం

ఓక్ ల్యాండ్ స్కూల్లో వైద్య శిబిరం

విజయనగరంలోని ఓక్ ల్యాండ్ స్కూల్లో వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ కృష్ణ చైతన్య పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన సూచనలు ఇచ్చారు. ఇందులో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ సరిత, కోఆర్డినేటర్ పీటర్ పాల్ మరియు రమణ పాల్గొన్నారు.