డ్రంకెన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష
VZM: జామి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి ఆటో నడుపుతున్న తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తికి ఎస్.కోట మొదటి శ్రేణి జడ్జి జీ.అప్పలనాయుడు 7 రోజులు శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం తెలిపారు. వివరాలోకి వెళ్తే.. ఈనెల 17న, వినాయకనగర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా వేపాడ మండలానికి చెందిన జే. స్వామి నాయుడు మద్యం సేవించి పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు.