భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున భర్త

సత్యసాయి: బత్తలపల్లి మండలం తంబాపురం వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మన్న (80) ఈ నెల 6న తన భార్య లక్షమ్మ పింఛన్ డబ్బులు ఇవ్వలేదని రోకలి బండతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. భార్యను హత్యచేశాడని ముద్రపడడంతో మనస్తాపం చెందిన అతను చెన్నేకుంటపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.