15 వేల లక్ష్యాలపై దాడులు చేశాం: అమెరికా
ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని అంతం చేయడమే తమ లక్ష్యమని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఈ మేరకు ఇజ్రాయెల్‌తో కలిసి ఇప్పటి వరకు 15 వేల లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపారు. మిగతా అన్ని స్థావరాలను ధ్వంసం చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో దాడులను మరితం తీవ్రతరం చేయనున్నట్లు పేర్కొన్నారు.