పోర్ట్ నిర్వాసితులకు గృహ నిర్మాణ మెటీరియల్ పంపిణి

పోర్ట్ నిర్వాసితులకు గృహ నిర్మాణ మెటీరియల్ పంపిణి

SKLM: సంతబొమ్మాళి(M) మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్వాసితులకు ఇవాళ తాత్కాలిక గృహనిర్మాణానికి సంబంధించిన రేకులు, ఇనుప రాడ్లు టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.కృష్ణమూర్తి పంపిణీ చేశారు. గ్రామం విడిచి నౌపడ వద్ద ఉన్న నిర్వాసితుల కాలనీకి కుటుంబాలు తరలి వెళ్లిపోవడంతో కుటుంబాలతో నివాసం ఉండేందుకు ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హేమసుందర్ ఉన్నారు.