మొగల్తూరు DCCB బ్రాంచ్ వద్ద సొసైటీ ఉద్యోగుల నిరసన
W.G: సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇవాళ మొగల్తూరు డీసీసీబీకి ఉద్యోగస్థులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించే వరకు దశల వారిగా ఉద్యమిస్తామన్నారు. GO36 వెంటనే అమలు చేయాలని, 2019, 2024 వేతన సవరణ, గ్రాట్యుటీ యాక్టు ప్రకారం అమలు చేయాలన్నారు. లాభ, నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు ఇవ్వాలన్నారు.