VIDEO: తెల్లవారుజామున హైవేపై బస్సు బోల్తా

VIDEO: తెల్లవారుజామున హైవేపై బస్సు బోల్తా

TPT: చిల్లకూరు జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అధిక వేగం కారణంగా రైటర్ సత్రం వద్ద శౌర్యన్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. బస్సు గుంటూరు నుంచి శబరిమలైకి అయ్యప్ప భక్తులతో వెళుతోంది. బస్సులో 35 మంది అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు అయ్యప్ప భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ప్రమాద స్థలానికి వెళ్లి కేసు నమోదు చేశారు.