ఇచ్చోడలో పొగాకు రహిత పాఠశాల
ADB: ఇచ్చోడ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ, జ్యోతిబాపులే రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలను పొగాకు రహిత పాఠశాలగా గుర్తించినట్లు జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సైకాలజిస్ట్ శ్రీకాంత్ తెలిపారు. పొగాకు రహిత యువతకై ప్రచారం 3.0లో భాగంగా గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.