VIDEO: పెంచికల్ పేట్‌లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
ASF: పెంచికల్ పేట్ మండలంలో వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పడిపోయి చలి రోజురోజుకు పెరుగుతుంది. మంగళవారం 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అడవుల కారణంగా సాయంత్రం నుంచే చల్లటి ఈదురుగాలులు వీస్తున్నాయి. రాత్రుళ్లలో ప్రజలు చలిమంటల వద్ద సేదతీరుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.