'మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టాలి'
NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ ఏపీ మహిళా సమాఖ్య సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా మహిళా నాయకురాలు సుశీలమ్మ పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, వేధింపులు జరుగుతున్నాయని మహిళా సంఘం నాయకులు ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న నేరాలను వెంటనే అరికట్టాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.